Discover and read the best of Twitter Threads about #అన్నమయ్యభావనిధానం

Most recents (5)

అన్నమయ్య కీర్తనల పై ఒక ప్రత్యేకమైన తీగ (special thread). తప్పులుంటే క్షమించగలరు. 👇🙏

#అన్నమయ్యభావనిధానం

అన్నమయ్య జయంతి సందర్భంగా అందరికీ ఆయన దయ వల్ల వేంకటేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను.

@Sarajags
అన్నమయ్య కీర్తనల విశిష్టత - పదకవిత్వం. పదకవిత్వం లో ఉదాహరణకు ఒక కీర్తన ఎన్నుకోవటం జరిగింది. అందరికీ సుపరిచితమైన కీర్తనే. దాని వివరణ తర్వాతి భాగంలో ఉంటుంది.
పదకవిత్వం ప్రత్యేకత వివరణ. అన్నమయ్య గొప్పతనం ఆయన పాటించిన ఒక సిద్ధాంతం ప్రకారం 32000 కీర్తనలు రచించటం.
Read 10 tweets
#అన్నమయ్యభావనిధానం

వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఎన్నో చక్కటి విషయాలను సులభంగా అర్ధమయ్యే తెలుగులో చెప్పగలిగినందుకు అన్నమయ్యను 'ఆచార్య' అన్నారు. ప్రతి చరణంలో మంచికి, చెడుకి ఉదాహరణలిస్తూ ఏది ఎందుకు హానికరమో వివరిస్తున్నాడు ఈ కీర్తనలో
@Sai_swaroopa @ivak99 @Vishnudasa_ @stellensatz
పల్లవి:
ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడనిజీవనము

చరణం 1:
చలము గోపంబు దను జంపేటిపగతులని
తెలిసినది యదిగదా తెలివి
తలకొన్నపరనింద తనపాలి మృత్యువని
తొలగినది యదిగదా తుదగన్నఫలము
.
.
@InduruMan @KamalPremi2 @khatvaanga @jayahanuma
చరణం 2:
మెఱయు విషయములే తనమెడనున్నవురులుగా
యెఱిగినది యదిగదా యెరుక
పఱివోనియాస దను బట్టుకొను భూతమని
వెఱచినది యదిగదా విజ్ఞానమహిమ

చరణం 3:
యెనలేని తిరువేంకటేశుడే దైవమని
వినగలిగినదిగదా వినికి
అనయంబు నతని సేవానందపరులయి
మనగలిగినదిగదా మనుజులకు మనికి
.
.
Read 6 tweets
#అన్నమయ్యభావనిధానం

ఆహా అద్భుతం! ఎంత సుందరమైన వర్ణన! పరమాద్భుతం! రాజు నరసింగరాయలు ఈ కీర్తన విని తనపై అటువంటి పాటే వ్రాయమని అడిగి blasphemy కి పాలుపడ్డాడు.

అమ్మవారికి అయ్యవారికి మధ్య జరిగిన అత్యంత పరమపవిత్రమైన సరసశృంగార కేళి. 🙏🙏🙏

@Sai_swaroopa @ivak99 @Vishnudasa_
సందర్భం:
అమ్మవారు రాత్రి పడకగదిలో అయ్యవారితో రతిక్రీడలో మునిగి తేలుతూ, తెల్లవారిన సంగతి మరచింది. వారిని శయన మందిరంలో మేలుకొలపటానికి వచ్చిన చెలికత్తెలు అమ్మవారి కళ్యాణవదనం చూసి, మార్పులు గమనించి చర్చించుకుంటున్న మాటలు.

@KalyaniMuktevi @KamalPremi2 @jayahanuma
పల్లవి:
ఏమొకొ చిగురుటధరమున యెడనెడఁ గస్తూరి నిండెను
భామిని విభుఁనకు వ్రాసిన పత్రిక కాదుగదా

చరణం 1:
కలికి చకోరాక్షికిఁ గడకన్నులు గెంపై తోఁచిన
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు
నలువున బ్రాణేశ్వరుపై నాటిన యాకొన చూపులు
నిలువునఁ బెరుకఁగ నంటిన నెత్తురు గాదు గదా
Read 9 tweets
#అన్నమయ్యభావనిధానం

గోపికలు కృష్ణుణ్ణి తలచుకుంటూ పాడుకునే ఎన్నో కీర్తనలు అన్నమయ్య రచించాడు. ఆ స్వామి బాల్యలీలలు వర్ణిస్తూ గోపికలు పాడుకుంటున్న కీర్తన.

ఎంత అందమైన పదాలు వాడాడో #Annamayya ఈ కీర్తనలో. "కొండ గొడుగుగా", "కోపగాడు", "వెండిపైడి".

@Sai_swaroopa @ivak99 @Vishnudasa_ Image
పల్లవి:
కొలనిదోఁపరికి గొబ్బిళ్ళో యదు-
కులము స్వామికిని గొబ్బిళ్ళో

చరణం 1:
కొండ గొడుగుగా గోవులఁ గాచిన
కొండుక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యులకెల్లను తల-
గుండు గండనికి గొబ్బిళ్ళో

@stellensatz @InduruMan @jayahanuma @KamalPremi2 @khatvaanga
చరణం 2:
పాపవిధుల శిశుపాలుని తిట్ల-
కోపగానికిని గొబ్బిళ్ళో
యేపునఁ గంసుని యిడుమలఁ బెట్టిన-
గోపబాలునికి గొబ్బిళ్ళో

చరణం 3:
దండి వైరులను తఱమిని దనుజుల-
గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిఁ బైఁడియగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో
.
.
Read 5 tweets
#అన్నమయ్యభావనిధానం 

"కడుపులోని లోకాలన్నీ కదులుతాయి. లాలి కాస్త నెమ్మదిగా ఊచండి".

అన్నమయ్య యశోదమ్మగా మారి, మిగతా గోపికలతో కృష్ణుడికి ఉగ్గు ఎలా పెట్టాలి, ఎలా లాలించాలి అని అత్యంత ఆప్యాయంగా పరితపించిన కీర్తన.
@stellensatz @ivak99 @Sai_swaroopa @Vishnudasa_
పల్లవి:
ఉగ్గు వెట్టరే వోయమ్మా చె-
య్యొగ్గీనిదె శిశువోయమ్మా

పల్లవి భావం:
ఉగ్గుపాల కోసం చేయి చాచుతున్నాడు కృష్ణుడు, ఆకలిగా ఉందేమో ఉగ్గు పెట్టండమ్మా.

చ1:
కడుపులోని లోకమ్ములు గదలీ
నొడలూచకురే వోయమ్మా
తొడికెడి సరుగన దొలగ దీయరే
వుడికెడి పాలివి వోయమ్మా

చ1 భావం:
ఇప్పుడే పొంగి వేడిగా ఉన్న పాలవి, పిల్లవాడు జాగ్రత్త, పక్కకు తియ్యండి. పరమాత్మ కాబట్టి కడుపులోని ఉంచుకున్న లోకాలన్నీ కదులుతాయి, మీరు ఈ బాలుని శరీరాన్ని ఎక్కువగా కదిలించొద్దు
Read 5 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!