Discover and read the best of Twitter Threads about #MannKiBaat100

Most recents (6)

►నా ప్రియమైన దేశప్రజలారా, మన ఉపనిషత్తులలో ఒక మంత్రం అనాదిగా మన మనసుకు ప్రేరణను అందిస్తోంది
"చరైవతి చరైవతి చరైవతి"
నడుస్తూ ఉండు, నడుస్తూ ఉండు, నడుస్తూ ఉండు.
►నేడు మనం "నడుస్తూ ఉండు,నడుస్తూ ఉండు" అనే ఇదే భావనతో వందవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాము.
#MannKiBaat100 Image
►భారతీయ సామాజిక జన జీవనాన్ని బలోపేతం చేసే మన్ కీ బాత్, అందరి మనసులనీ జోడించే మాలలో దారం వంటిది.
►ప్రతి సంచికలోనూ దేశప్రజల సేవా సామర్థ్యాలు ఇతరులకు ప్రేరణను అందించాయి.
►ఈ కార్యక్రమం ద్వారా ప్రతి దేశపౌరుడూ మరొక పౌరుడికి ప్రేరణగా నిలుస్తాడు.
►ఒక రకంగా ప్రతి మన్ కీ బాత్ సంచిక, తదుపరి కార్యక్రమానికి నేపథ్యాన్ని సిధ్ధం చేస్తుంది.
►మన్ కీ బాత్ ఎప్పుడూ సద్భావనతో, సేవా భావంతో, కర్తవ్య భావనతోనే ముందుకు నడిచింది.
►స్వాతంత్ర అమృతకాలంలో ఇదే సానుకూలత దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది.
Read 4 tweets
►మిత్రులారా.. నేడు దేశంలో పర్యాటన చాలా వేగంగా పెరుగుతోంది : ప్రధాని మోదీ
►మన ప్రాకృతిక వనరులైన నదులు, కొండలు, చెరువులు, లేదా మన పుణ్య క్షేత్రాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం.
► ఇది పర్యాటకరంగానికి చాలా సహాయపడుతుంది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannkiBaat100Episode Image
►పర్యాటనలో పరిశుభ్రతతో పాటూ మనం Incredible India movement గురించి కూడా ఎన్నో సార్లు చర్చించాము.
►ఈ ఉద్యమం వల్ల ప్రజలకు వారి చుట్టుపక్కలే ఉన్న ఎన్నో ప్రాంతాల గురించి మొదటిసారిగా తెలిసింది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannkiBaat100Episode
►మనం విదేశాలకు పర్యటనకు వెళ్ళే ముందు మన దేశంలో ఉన్న కనీసం పదిహేను పర్యాటక ప్రదేశాలకు తప్పకుండా వెళ్ళాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను.
►ఈ ప్రదేశాలు మీరు నివసించే సొంత రాష్ట్రానికి చెందినవి కాకుండా వేరే రాష్ట్రం తాలూకూ ప్రదేశాలయితే బావుంటుంది : ప్రధాని మోదీ
#MannKiBaat100
Read 4 tweets
► మన్ కీ బాత్ లో మనం ప్రస్తావించుకునే వ్యక్తులే మనకు నాయకులు. వారే ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చారు : ప్రధాని మోదీ
► ఇవాళ మనం ఈ కార్యక్రమ నూరవ అంకానికి చేరుకున్నామంటే, మరోసారి మనందరమూ ఈ నాయకులందరి వద్దకూ వెళ్ళి, వారి ప్రయాణాని గురించి తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది. Image
►నేడు మనమ్ కొందరు మిత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం : ప్రధాని మోదీ
►నాతో ఇప్పుడు హర్యానాకు చెందిన సోదరుడు సునీల్ జగ్లాన్ గారు ఉన్నారు.
►సునీల్ జగ్లాన్ గారి ప్రభావం నా మనసుపై ఎంతో ఉంది : ప్రధాని మోదీ
►ఎందుకంటే హర్యానాలో లింగ నిష్పత్తిపై ఎంతో చర్చ జరుగుతూ ఉండేది.
►నేను కూడా "బేటీ బచావో-బేటీ పఢావో" ఉద్యమాన్ని హర్యానా నుంచే మొదలుపెట్టాను : ప్రధాని మోదీ
►సునిల్ గారి "సెల్ఫీ విత్ డాటర్" ఉద్యమం పై నా దృష్టి పడినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.
►నేను ఆయన వద్ద నేర్చుకుని, దానిని మన్ కీ బాత్ లో పంచుకున్నాను.
Read 5 tweets
►నాకు "మన్ కీ బాత్" అంటే ప్రజల రూపంలో ఉన్న భగవంతుడి చరణాల వద్ద ఉంచే ప్రసాదపు పళ్ళెం లాంటిది : ప్రధాని మోదీ
►మన్ కీ బాత్ కార్యక్రమం నా మనసు చేసే ఆధ్యాత్మిక ప్రయాణంగా మారింది.
►మన్ కీ బాత్ - "నా" నుంచి మొదలయ్యే సమిష్ఠి ప్రయాణం : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannKiBaat Image
►మన్ కీ బాత్ - అహమ్ నుంచి వయం వరకూ ప్రయాణం.
►ఇది నేను కాదు, మీరు చేసే సంస్కార సాధన : ప్రధాని మోదీ
►మీరు ఉహించండి, నా దేశ పౌరుడొకడు నలభై ఏళ్ళ నుంచీ నిర్జన కొండప్రాంతంలో, బంజరు భూమిలో చెట్లు నాటుతున్నాడు.
►ఎంతో మంది ప్రజలు ముఫ్ఫై ఏళ్ల నుంచీ నీటి సంరక్షణ కోసం బావులను, చెరువులను తయారుచేస్తున్నారు. వాటిని శుభ్రపరచి, సంరక్షిస్తున్నారు : ప్రధాని మోదీ
►కొందరు ఇరవై-ముఫ్ఫై ఏళ్ళుగా పేద విద్యార్థులను చదివిస్తున్నారు, కొందరు పేదలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
Read 5 tweets
►నా ప్రియమైన దేశప్రజలారా,
►ఈ కార్యక్రమం నన్ను మీ నుంచీ ఎప్పుడూ దూరం కానివ్వలేదు : ప్రధాని మోదీ
► నాకు బాగా గుర్తుంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అక్కడి సామాన్య ప్రజలతో కలిసి తిరగడం అనేది సహజంగానే జరుగుతూ ఉండేది.
#MannKiBaat100 #MannKiBaat Image
►ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొనే కార్యక్రమాలు, చేసే పనులు ఇలా ప్రజలతో కలిసి ఉండే అవకాశాలను ఎక్కువగా వస్తూనే ఉంటాయి.
►కానీ.. 2014లో ఢిల్లీ వచ్చిన తరువాత ఇక్కడి జీవితం అందుకు పూర్తిగా విరుధ్ధంగా ఉంది : ప్రధాని మోదీ
#MannKiBaat100 #MannKiBaat
►విభిన్నమైన పని, ఆ పని స్వరూపమే వేరు. బాధ్యతలు వేరు. షరతులు, పరిస్థితుల ఆంక్షలు, భద్రత వ్యవస్థ, సమయ పరిమితి ఇవన్నీ విభిన్నంగా ఉండేవి.
►మొదట్లో ఎంతో కొత్తగా ఉండేది. ఏదో వెలితిగా ఉండేది.
Read 5 tweets
►అసలు మన్ కీ బాత్ మొదలయ్యి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు గడిచాయి అంటే నమ్మశక్యంగా ఉండదు : ప్రధాని మోదీ
► ప్రతి కార్యక్రమమూ దేనికదే ప్రత్యేకమైనది. ప్రతిసారీ, సరికొత్త ఉదాహరణల కొత్తదనం, ప్రతిసారీ దేశప్రజల కొత్త విజయాలు ఇందులో భాగమయ్యాయి.
#MannKiBaat100 #MannKiBaat
►మన్ కీ బాత్ లో దేశం నలుమూలల నుండీ ప్రజలు పాల్గొన్నారు. అన్ని వయసుల వారు ఇందులో భాగమయ్యారు : ప్రధాని మోదీ
►"బేటీ బచావో, బేటీ పఢావో" గురించి , "స్వచ్ఛభారత ఉద్యమం" గురించి, ఖాదీ పట్ల ప్రేమ వ్యక్తపరచడం అయినా ప్రకృతి గురించిన కబుర్లయినా, స్వతంత్ర అమృతోత్సవాల గురించి లేదా అమృత సరోవరం గురించి అయినా, "మన్ కీ బాత్" ఏ విషయంతో ముడిపడినా సరే అది ప్రజా ఉద్యమంగా మారింది.
Read 4 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!