Discover and read the best of Twitter Threads about #Chittoor_Temples

Most recents (6)

రాముడు, రామాయణం, రాయలసీమ -Part 7

రాముడు, రామాయణంతో సంబంధం ఉన్న తీర్థాలు, చిత్తూరు జిల్లా

శ్రీకోదండరామ స్వామి ఆలయం - తిరుపతి, చిత్తూరు జిల్లా

త్రేతాయుగంలో రామలక్ష్మణులతోపాటు ఈప్రాంతంలో జాంబవంతుడు, హనుమంతుడు మొదలగువారు ఇక్కడ సంచరించారని, ఇక్కడి శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు Image
జాంబవత ప్రతిష్టితమని ఐతిహ్యం. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రామలక్ష్మణులు తెల్లని ఊర్ధ్వపుండ్రాలు ధరించి తిరుమల శ్రీవారి విగ్రహాన్ని గుర్తుకుతెచ్చేలా ఉంటారు.

శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం , అరగొండ

రామ-రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా Image
వారిని రక్షించేందుకు సంజీవని మొక్క కోసం హనుమంతుడు పర్వతం తెచ్చే సమయంలో దివ్యమూలికలతో కూడిన ఒక భాగం ఇక్కడ పడిందని అదే అరకొండ క్షేత్రమని ఆలయ చరిత్ర. ఈ క్షేత్రంలో వనమూలికా ప్రభావంతో వెలసిన శ్రీ సంజీవరాయ పుష్కరిణి తీర్థాన్ని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయాని భక్తుల విశ్వాసం.
Read 9 tweets
రాముడు, రామాయణం, రాయలసీమ -Part 6

రాముడు, రామాయణంతో సంబంధం ఉన్న తీర్థాలు, చిత్తూరు జిల్లా

శ్రీకాళహస్తి - వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిని రాములవారు, సీతమ్మతల్లి దర్శించుకున్నారని ప్రతీతి. శ్రీకాళహస్తి ఆలయ ప్రాంగణంలో రామ లింగం, సీతమ్మ లింగాలను చూడవచ్చు. Image
శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం, వాల్మీకిపురం / వాయల్పాడు

శ్రీ పట్టాభిరామస్వామి ఆలయం శ్రీరామపంచాయతన క్షేత్రం (శ్రీరామ, భరత, లక్ష్మణ శత్రుఘ్నులు, సీతామాత, హనుమంతుల విగ్రహాలు ఈఆలయంలో దర్శనమిస్తాయి) . ఇక్కడ స్వామివారు వల్మీకం నుండి స్వయం ప్రకటితమయ్యారట.
అందుకే ఈక్షేత్రాన్ని వాల్మీకాపురం అంటరాని ఒకకథనం కాగా ఇక్కడ ఒకప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమం ఉండేదని, ఆ మహర్షి తపస్సుచేసిన ప్రాంతం కాబట్టి వాల్మీకపురం అయింది అనిమరోకథనం., బోయలు ఇక్కడ ఎక్కువఉండటం వల్ల బోయలపాడు అనీ అదే కాలక్రమేణా వాయలపాడు అయ్యిందని ప్రతీతి.
Read 9 tweets
తిరుపతి గంగమ్మ జాతర - సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు

సిద్ధి చెందిన తిరుపతి గంగమ్మ జాతరకు, సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?

రాయలసీమలో అత్యంత వైభవంగా జరిగే పండుగలు / జాతరాలలో తిరుపతి గంగమ్మ జాతర ముందువరసలో ఉంటుంది. ImageImage
తాతయ్యకుంట గంగమ్మ తిరుపతి గ్రామదేవత. తిరుపతిని నిత్యం కాపాడే తల్లి.

అయితే గంగమ్మ తిరుపతి చేరుకోవడం వెనుక ఒక కథ ఉంది. అమ్మవారు మొదట కడప ప్రాంతంలోని ఒక ఊరిలో ఉండేవారట. ఆ ఊరిలో భయంకర వ్యాధులు ప్రబలి ఏటా అనేక మంది మరణిస్తుండగా, అమ్మవారు ఏడాదికి ఒకరిని నరబలి ఇస్తే, మరణాలు ఆగిపోతాయని
చెప్పగా గ్రామస్థులు అంగీరకరించారట. ఏటా గంగమ్మ జాతర సమయంలో బయటి వ్యక్తులు ఎవరైనా ఆ ఊరి వెంట వెళుతూ ఉంటే వారిని బలిచ్చేవారట. ఒకయేట తాతాచార్యులు చిక్కినారట.
జాతరలో పూనకం వచ్చిన ఒక వ్యక్తి బలి బలి అని తాతాచార్యుల మీదకి రాగా, ఆచార్యుల వారు బాగా ఎర్రగా కాల్చిన శంఖు చక్ర ముద్రలు
Read 5 tweets
పాపవినాశనం

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు

ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు. Image
“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను

#Ravishing_Rayalaseema Image
Read 8 tweets
రాయలసీమ - దశావతార ఆలయాలు

“ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవత్గీతలో.
అంటే ధర్మాన్నిస్థాపించడంకోసం/నిలబెట్టడంకోసం ప్రతీయుగంలోనూఅవతరిస్తానుఅనిఅర్థం

దశావతారాలలోని రామ, కృష్ణ, నరసింహ అవతారాలకు విశేషంగా ఆలయాలుఉన్నాయి.
కానీ. మత్స్య, కూర్మ వంటి అవతారాలకు దేశం మొత్తంలో చాలా అరుదుగా మాత్రమే ఆలయాలు ఉన్నాయి.

అయితే దశావతారాలకు సంబంధించి రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన, అత్యంత అరుదైన ఆలయాల విశేషాలు

మత్స్యావతారం:

సృష్టికర్త బ్రహ్మ వద్ద నుండి సోమకాసురుడు వేదాలు తస్కరించి సముద్రగర్భంలో దాక్కుంటే
శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి వధించి వేదాలను రక్షిస్తాడు.

దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతార మూర్తికి ఆలయాలు అత్యంత అరుదు. అటువంటి ఆలయాలలో ఒకటి చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం నాగలాపురం పట్టణంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం.
Read 23 tweets
జపాలి క్షేత్రం

అవతరించిడానికంటే ముందే హనుమంతుడు రూపాన్ని భక్తునికి దర్శన భాగ్యం అనుగ్రహించిన అత్యంత పవిత్రమైన క్షేత్రం ఏమిటో తెలుసా?

పరమ పవిత్ర తిరుమల క్షేత్రంలో శ్రీరాముడు స్నానమాచరించిన రామ గుండం ఎక్కడ ఉందో తెలుసా?

అనేక విశేషాలకు నెలవైన ఆ క్షేత్రమే జపాలి క్షేత్రం. Image
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వేంకటాచలం అణువణువూ పవిత్రమైన స్థలమే. 108 దివ్య తీర్థాలతో అలరారుతున్న తిరుమలలో తప్పక చూడవలసిన క్షేత్రాలలో ఒకటి జపాలి తీర్థం / జపాలి ఆంజనేయ స్వామి గుడి

#Rayalaseema_Temples #Chittoor_Temples #Ravishing_Rayalaseema #Tirumala ImageImage
స్థల పురాణం :

త్రేతాయుగంలో దుష్ట సంహారం చేయడానికి శ్రీ మహావిష్ణువు శ్రీ రామచంద్ర స్వామి అవతారం ఎత్తగా, శ్రీరాములవారికి సహాయము చేయడానికి శివుడే / శివుడి అంశనే ఆంజనేయ స్వామిలా అవతరించారని ప్రతీతి.
Read 11 tweets

Related hashtags

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!